పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి

Mon,November 19, 2018 01:44 AM

కమాన్‌చౌరస్తా: పద్మశాలీ సామాజికవర్గంలోని వారందరూ రాజకీయంగా ఎదగాలని తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోషిక యాదగిరి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని పద్మశాలీ వసతిగృహంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ జిల్లా పద్మశాలీ సంఘ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. అంతా కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా పద్మశాలీ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) అధ్యక్షుడు పోలు సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లా పద్మశాలీ సంఘానికి ఎల్లవేళలా తాము అండగా ఉంటామన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన మెతుకు సత్యం, గౌరవాధ్యక్షుడు వాసాల రమేశ్, ప్రధాన కార్యదర్శి వల్లాల క్రిష్ణహరి, ఆర్థిక కార్యదర్శి అల్స భద్రయ్య, ఉపాధ్యక్షుడు బుధారపు శ్రీనివాస్, సబ్బని రాజేందర్, సహాయ కార్యదర్శి రుద్ర రాజు, కార్యనిర్వాహక కార్యదర్శి వొడ్నాల రవీందర్, ప్రచార కార్యదర్శి మార్త ప్రకాశ్‌తోపాటు జిల్లా కార్యవర్గ కమిటీచే ఎన్నికల అధికారిగా వ్యవహరించిన గోనె శ్రీనివాస్ ప్రమాణం చేయించారు. మ్యాడం బాబూరావు, వాసాల రమేశ్, ఇప్పనపెల్లి సాంబయ్య, వూశకోయిల రాంచంద్రం, అరుకాల వీరేశలింగం, మ్యాన సత్యనారాయణ, దూడం లక్ష్మీరాజం, పెంటి సత్యనారాయణ, ఎలగందుల సత్యనారాయణ, చేరాల మల్లికార్జున్‌దేవ్, స్వర్గం మల్లేశం, దూడం శ్రీనివాస్, వేముల విష్ణుమూర్తి, దూడం అశోక్, గుండేటి శ్రీనాథ్, మంచికట్ల కోటేశ్వర్, దూడం మల్లేశం, వెయ్యి మంది పద్మశాలీ నేతలు పాల్గొన్నారు.

247
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles