నేత కార్మికులు కాదు..కళాకారులు


Mon,November 19, 2018 01:44 AM

-నేటి నుంచి చేనేత వస్ర్తాలే ధరిస్తా..
-రాష్ట్ర సహకార యూనియన్ ఎండీ అరుణ
హుజూరాబాద్‌టౌన్: నేతపని చేసే వారు కార్మికులు కాదు.. వారు అసలు సిసలైన కళాకారులని రాష్ట్ర సహకార యూనియన్ ఎండీ బీ అరుణ పేర్కొన్నారు. 65వ అఖిల భారత సహాకార వారోత్సవాల్లో భాగంగా ఆదివారం హుజూరాబాద్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘ కార్యాలయంలో పథకాలు, ఆదాయ మార్గాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను ఈ రోజు నుంచి నేత వ స్ర్తాలనే ధరిస్తానని ప్రకటించారు. ఉద్యోగులు సైతం వారా నికో సారి ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంఘాలు ఎదు ర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరి ష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహకార యూనియ న్ చైర్మన్ రాజేశ్వర్‌రావు మాట్లాడుతు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నే త వస్ర్తాలకు ప్రత్యేక గుర్తింపు ఉందనీ, ఇటీవలే నియోజకవర్గంలోని వావిలాల ఖాదీకి జాతీయ, జమ్మికుంట, హుజూరాబాద్ చేనేత సంఘాలకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయని గుర్తు చేశా రు. అంతకుముందు కార్మికులతో యూనియన్ అధికారులు, పా లకవర్గ సభ్యులు సహకార ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అరుణను జిల్లా సహకార యూనియన్ అధికారులు సన్మానించారు. చేనేత అండ్ జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి సీహెచ్ మనోజ్‌కుమార్, డిప్యూటీ రిజిస్ర్టార్, ఈఓ వీ సుజాత, శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ భూక్య వెంకన్న, లెక్చరర్ పీ రాజయ్య, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, సహాకార ఆడిటర్ ఎండీ జలాలోద్దీన్ అక్బర్, చేనేత సం ఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్, ఉపాధ్యక్షుడు వేముల యాదగిరి, కోశాధికారి జీ మహాదేవ్, మేనేజర్ వైకుంఠం పాల్గొన్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...