అమృతత్వం కలిగినవే గర్రెపల్లి పద్యాలు


Mon,November 19, 2018 01:44 AM

కరీంనగర్ కల్చరల్: అమృతత్వం కలిగినవే గర్రెపల్లి సత్యనారాయణరాజు పద్యాలు అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందినీ సిధారెడ్డి అన్నారు. ఆదివారం ఫిల్మ్‌భవన్‌లో సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కవికోకిల గర్రెపల్లి కలస్యనం, స్వప్నఫలం, శ్రీరంగ ప్రభూశతకం, కవితా మంజరిని ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. వలసపాలకుల వివక్షతోనే సత్యనా రాయణ రాజుకు అన్యాయం జరిగిందన్నారు. పద్యం గేయం రెండింటినీ అద్భుతంగా రాశాడని ప్రశంసించారు. అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ గర్రెపల్లి కవిత్వం ఆధునికతను కలిగి ఉందన్నారు. డాక్టర్ నాళేశ్వరం మాట్లాడుతూ స్వప్న ఫలం ఉపాధ్యాయ జా తి ఉన్నంతవరకు గర్రెపల్లి నిలుస్తాడన్నారు. ఆచార్య వినయ్‌బాబు, కందుకూరి శ్రీరాములు, బీవీఎన్ స్వామి, రిటైర్డ్ డీ ఈఓ రామేశ్వర్‌రాజు, రంగప్రసాద్‌రాజు, జలంధర్‌రెడ్డి, మాడిశెట్టి గోపాల్, కేఎస్ అనంతాచార్య ప్రసంగించారు. లక్ష్మణరాజు, గాజుల రవీందర్, సింగమరాజు, వేణుశ్రీ, డాక్టర్ మచ్చ హరిదాసు, బొమ్మకంటి కిషన్, గంప ఉమాపతి, గజేందర్‌రెడ్డి, వైరాగ్యం ప్రభాకర్ పాల్గొన్నారు. గర్రెపల్లి జ్ఞాపకార్థం నిర్వహించే సదస్సుకు తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జలంధర్‌రెడ్డి రూ. 10 వేలు ఇస్తానని ప్రకటించినట్లు మాడిశెట్టి గోపాల్ తెలిపారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...