మోతెవాగుపై ఆందోళన వద్దు

Mon,November 19, 2018 01:44 AM

-సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మద్దు
-వాగులో నిత్యం నీరుండేలా చర్యలు
-కాళేశ్వరం పూర్తయితే వరదకాలువకు తూములు
-చొప్పదండి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్
రామడుగు: మోతెవాగుపై పరివాహక ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టు నిర్మాణాలు జరగడం లేదు. ఇటీవల మోతెవాగుపై తాను చేసిన వాఖ్యలను కొందరు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.. అంటూ చొప్పదండి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పేర్కొన్నా రు. శనివారం ఒక ప్రకటన విడుదలో చేశారు. తాను కేవలం పరివాహక గ్రామాల ప్రజలకు ఉపయోగపడేవిధంగా వాగుపై అడ్డుకట్టవేసి నీటిని నిలిపేందుకు ఇంజినీర్లు ప్రతిపాదించిన విషయం పై మాత్రమే మాట్లాడాడని చెప్పారు. భవిష్యత్తు లో స్థానిక ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాగు, సాగు నీరందించేందుకు మా త్రమే మోతెవాగులో తొమ్మిది నెలలపాటు నిత్యం నీరు ఉండేలా చర్యలు చేపడతామన్నారు. గత పాలకులు ఇక్కడి ప్రజలకు తాగు, సాగునీరందిం చడంలో విఫలమయ్యారన్నారు. బావుల్లో నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోయాయన్నా రు. ప్రజల బాధలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లంపల్లి పైపులైన్, నారాయణపూర్ ప్రాజెక్టు, వరదకాలువ ద్వారా నీటిని విడుదల చేసి నియోజకవర్గంలోని పలు మండలాల్లో చెరువులు, కుంటలను నింపేలా చర్యలు తీసుకున్నా రన్నారు. రామడుగుతో పాటు చొప్పదండి మండలాల్లోని పలు గ్రామాల అవసరాల మేరకు గత ప్రభుత్వం మోతె ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిందన్నారు.

మొదట్లో రెండున్నర టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలనుకున్నా ప్రజల విజ్ఞ ప్తి మేరకు 1.6 టీఎంసీకి కుదించారన్నారు. అయినప్పటికీ కొరటపల్లి, షానగర్, రామడుగు గ్రా మా ల ప్రజలు ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం ప్రా జెక్టు పనులు నిలిపివేసిందన్నారు. ఇక్కడి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం నుంచి మధ్యమానేరుకు వరదకాలువ ద్వారా వెళ్లే నీటిని తూములు నిర్మించి మోతెవాగుకు మళ్లీంచి పూర్తిస్థాయిలో నిలిపేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు చేశారన్నారు. కేవలం దీనిపైనే తాను మాట్లాడననీ, ఒకవేళ వాగులో నీటినిలువపై కూడా స్థానికులకు ఏమైనా అభ్యంతరాలుంటే పరిగణలోకి తీసుకొని ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపడతామన్నా రు. ముఖ్యంగా కొరటపల్లి, రామడుగు, షానగర్ గ్రామాలకు ముం పు సమస్య లేకుండా వాగులో మాత్రమే నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకుంటాని స్పష్టం చేశారు. గత ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో ఈ చర్య ముందుకు సాగలేదన్నారు. మోతెవాగును నీటితో నింపడంద్వారా ఈ మూడు గ్రామాలతో పాటు మండలంలోని సుమారు 16 గ్రామాల ప్రజలు, రైతులకు తాగు, సాగు నీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరునున్నాయి.

ముఖ్యంగా కాళేశ్వరం ప్రా జెక్టు ద్వారా వచ్చే నీటితో ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ మధ్య ఉండే భూములకు అవసరం ఉన్నచోట లిఫ్టులు, తూములను ఏర్పాటు చేసి నీళ్లిచ్చే యత్నం చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాతిపాదనలు కూడా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పూర్తిచేశారన్నారు. కాళేశ్వరం నిర్మాణం పూర్తికాగానే మండలంలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా చేస్తామని చెప్పారు. మరో విషయం చెప్పాలంటే మండల కేంద్రంలోని నర్సింగరావు చెరువులో సుమారు అరవై ఏండ్లకు పైగా నీరు చేరలేదని ప్రస్తుతం స్థానిక జడ్పీటీసీ చొరవతో నారాయణపూర్ చెరువు నుంచి వాగుద్వారా నర్సింగరావు చెరువును నింపామన్నారు. దీంతో ఇక్కడి ప్రజల ఆనందాలకు అవధులు లేకుండాపోయా యి. చిన్నపెద్దా నీటితో నిండిన నర్సింగరావు చెరవును చూసి కేరింతలు కొడుతున్నారు. ము ఖ్యంగా మోతెవాగు ద్వారా ఈ సంవత్సరం దేశరాజ్‌పల్లి, రుద్రారం చెరువులను కూడా నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటితో నింపామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి ఊరి చెరువు నిండాలి.. బంగారు పంటలు పండాలి..కేసీఆర్ కన్న కలలు నిజ కావాలన్నదే మా సంకల్పమన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

233
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles