అధినేత వస్తున్నారు..

Fri,November 16, 2018 01:07 AM

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ఆది నుంచీ తనకు అన్ని విధాలా కలిసొచ్చిన గడ్డ నుంచే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రెండో సారి ఎన్నికల శంఖారావం పూరించారు. గత సెప్టెంబర్ 7న హుస్నాబాద్ వేదికగా నియోజకవర్గ సభలకు శ్రీకారం చుట్టి, ఒక్కసారిగా ప్రచారం హోరెత్తించారు. ఆ తర్వాతి నుంచి అసెంబ్లీ అభ్యర్థులు పల్లెపల్లెనూ చుట్టడం మొదలు పెట్టారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో ఉత్సాహంగా ముందుకు కదిలారు. నియోజకవర్గ సభలు ఉంటాయని అధినేత అప్పటికే ప్రకటించడంతో అందరూ ఎప్పుడెప్పుడు ఉంటాయా? అని ఎదరుచూశారు. ఒక్కసారి అధినేత వస్తే నియోజకవర్గాల్లో కారు జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్తుందనీ, తమకు మరింత మద్దతు పెరుగుతుందని భావించారు. తాజాగా గులాబీ దళపతి నియోజకవర్గ సభ షెడ్యూల్ ఖారారు కావడంతో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలంతా సంబురపడుతున్నారు. 20న కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో నిర్వహించే సభలకు కేసీఆర్ రానుండగా, అప్పుడే ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

ఇదీ షెడ్యూల్..
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19, 20 తేదీల్లో తొమ్మిది నియోజకవర్గాలను కవర్ చేసేలా సభలు ఉండనుండగా, 20న కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం 2.30గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో, 3.30 గంటలకు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కలిపి సిరిసిల్లలో సభ ఉండనున్నది.

239
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles