విద్యాలయాల్లో బాలల పండుగ

Thu,November 15, 2018 01:13 AM

-ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
-చాచా నెహ్రూకు ఘన నివాళి
హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చాచా నెహ్రూకు ఘనంగా నివాళులర్పించారు. హుజూరాబాద్ పట్టణంలోని శ్రీకాకతీయ పాఠశాలలో ఫుడ్‌ఫెస్టివల్, ఫ్యాన్సీ డ్రెస్స్ కాంపిటిషన్స్, ర్యాంప్ వాక్, స్వయం పరిపాలన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరస్పాండెంట్ కొండపర్తి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు శ్యాంసుందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
హుజూరాబాద్‌టౌన్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (బాలికలు) పాఠశాలలో స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముందుగా స్పందన సేవా సంస్థ అధ్యక్షురాలు శోభారాణి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. బాలల హక్కుల వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి, వైస్ ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే విద్యానగర్‌లోని విజ్ఞాన్ నెక్ట్స్‌జెన్, టెట్రా కిండర్‌గార్డెన్, శ్రీవివేకవర్ధిని హైస్కూల్, ఆదర్శ పాఠశాలలో స్వయం పాలన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో నెక్ట్స్‌జెన్ పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్‌రెడ్డి, ఆదర్శ పాఠశాల కరస్పాండెంట్ పరాంకుశం కిరణ్‌కుమార్, వివేకవర్దిని పాఠశాల కరస్పాండెంట్ మాడిశెట్టి ప్రసాద్, డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే స్థానిక యూపీఎస్‌లో బాలల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇందులో పాఠశాల హెచ్‌ఎం రాధాకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జమ్మికుంట: పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో బుధవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారారు. తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. తర్వాత జరిగిన కార్యక్రమాల్లో చాచా నెహ్రూ, జాతీయ నాయకుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో విద్యాసంస్థలకు చెందిన ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్: తుమ్మనపల్లి గ్రామంలోని ఏకశిల పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. డైరెక్టర్ దినేశ్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట: బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో చిన్నారులు బుడగలు ఊది గాలిలోకి ఎగరవేశారు. ఆయా కార్యక్రమాల్లో హెచ్‌ఎంలు శ్రీనివాస్, రమణారెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సైదాపూర్: మండలంలోని ఆరెపల్లి ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందించారు. హెచ్‌ఎం సతీశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వీణవంక: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వీణవంక సరస్వతీ శిశుమందిర్ ప్రధానోపాధ్యాయులు మల్లేశ్, చల్లూరు హెచ్‌ఎం చంద్రశేఖర్, మామిడాలపల్లి హెచ్‌ఎం సునీత, ఉపాధ్యాయులు ప్రసన్న, బాలాజీ, శ్రీనివాస్, దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

268
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles