ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంల పంపిణీ

Tue,November 13, 2018 01:38 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ర్యాండమైజేషన్ ద్వా రా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ వెనుక గల గోదాములో ఈవీఎంలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక పెద్ద బాక్స్‌లో పది ఈవీఎంలుంటాయని ర్యాండమైజేషన్‌లో అవి వేర్వేరు నియోజకవర్గాలకు కేటాయించబడతాయన్నారు. కేటాయించిన ఈవీఎంలను ఆయా నియోజకవర్గ పంపిణీ కేంద్రాల్లో భద్రపరచనున్నట్లు తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గానికి 391 బ్యాలెట్ యూనిట్లు, 391 కంట్రోల్ యూనిట్లు, 426 వీవీ ప్యాట్‌లను కేటాయించినట్లు పేర్కొన్నారు. చొప్పదండికి 288 బ్యాలెట్ యూని ట్లు, 288 కంట్రోల్ యూనిట్లు, 314 వీవీ ప్యాట్ లు, మానకొండూర్‌కు 282 బ్యాలెట్ యూనిట్లు, 282 కంట్రోల్ యూనిట్ల్లు, 308 వీవీ ప్యాట్‌లు, హుజూరాబాద్‌కు 307 బ్యాలెట్ యూనిట్లు, 307 కంట్రోల్ యూనిట్లు, 355 వీవీ ప్యాట్‌లను కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లకు అదనంగా పదిశాతం ఈవీఎంలను ఈ ర్యాండమైజేషన్‌లో కేటాయించినట్లు జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, జిల్లా రెవెన్యూ అధికారి బిక్షానాయక్, ఈవీఎంల నోడల్ ఆఫీసర్, మెప్మా పీడీ పవన్‌కుమార్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాలి
చొప్పదండి, నమస్తే తెలంగాణ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈనెల 12నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. చొప్పదండి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసేపుడు అభ్యర్థితో పాటు మరో ముగ్గురిని మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలన్నారు. నామినేషన్ సందర్భంగా ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల ఖర్చు తెలియజేయడానికి నామినేషన్ వేసే ముందురోజే అభ్యర్థి బ్యాంకు ఖాతా తెరిచి ఉండాలని సూచించారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట నియోజకవర్గ ఎన్నికల అధికారి, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్.నాగేశ్వర్‌రావు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.

నామినేషన్ కార్యాలయం పరిశీలన
మానకొండూర్ రూరల్ : శాసనసభ ఎన్నికల సందర్భంగా మానకొండూర్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పరిశీలించారు. మానకొండూర్ ఎన్నికల అధికారి వెంకట మాధవరావు, తహసీల్దార్లు శ్రీనివాస్, రజితలతో మాట్లాడి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో అభ్యర్థులు నియమావళిని పాటించేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ట్రెయినీ కలెక్టర్ ప్రావీణ్య, నాయాబ్ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్‌ఐలు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

199
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles