టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు


Mon,November 12, 2018 01:16 AM

-నోటిఫికేషన్‌కు ముందే అందించిన అధినేత కేసీఆర్
-ఈటల, గంగుల, రసమయి, వొడితల హాజరు
-ప్రచార సరళిపై అభ్యర్థులకు దిశానిర్దేశం
-మరింత వేగం పుంజుకోనున్న ప్రచారం
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ముందు నుంచీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నది. గత సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, ఆ రోజునే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టిచింది. ఆ తర్వాత ప్రచారంలో కూడా ప్రత్యర్ధులకు అందని రీతిలో దూసుకుపోయింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ఒక రోజు ముందే ప్రకటించిన అభ్యర్థులందరికీ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా బీఫారాలు అందజేశారు. ఆదివారం రాత్రి రాజధానిలోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్ కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మినహా హుజూరాబాద్, కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్ అభ్యర్థులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్‌కు బీ ఫారాలను అందించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో అభ్యర్థులపై ప్రచారంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థులంతా ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు వివరిస్తున్న తీరు బాగుందనీ, తనకు వచ్చిన రిపోర్టుల ప్రకారం ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తున్నదని పేర్కొన్నారు. అయినా ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా ముందుకు సాగాలనీ, ఈ 25రోజులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరగడం, అందరికంటే బీఫారాలు అందుకోవడం, అధినేత ప్రచారం బాగుందని కితాబు ఇవ్వడంతో అభ్యర్థులు ఉత్సాహంగా వెనుదిరిగారు.

227
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...