మాది ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ


Mon,November 12, 2018 01:13 AM

-టీఆర్‌ఎస్ మానకొండూర్ నియోజకవర్గ అభ్యర్థి రసమయి
మానకొండూర్/మానకొండూర్ రూరల్: టీఆర్‌ఎస్ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ అనీ, నిరుపేదల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని టీఅర్‌ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. అదివారం ఆయన మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా, గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. రసమయి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చిన ఘనత టీఅర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నాలుగున్నరేండ్లలోనే ఎంతో అభివృద్ధి చేసి, చూపించామన్నారు. అధికార కాంక్షతో కాంగ్రెస్, టీడీపీలు మహాకూటమిగా జతకట్టి వస్తున్నాయనీ, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీ సభ్యుడు ఎడ్ల సుగుణాకర్, వైస్ ఎంపీపీ దేవ సతీశ్‌రెడ్డి, టీఅర్‌ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, అర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్‌రెడ్డి, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు యాట కోమల, కోండ్ర నిర్మల, రేణుక, టీఅర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రం కిరణ్‌గౌడ్, టీఅర్‌ఎస్‌వై మండలాధ్యక్షుడు ఆడప శ్రీనివాస్, నాయకులు మల్లగల్ల నగేశ్, పారునంది కిషన్, నామాల శ్రీనివాస్, శాతరాజు యాదగిరి, దండబోయిన శేఖర్, మర్రి ఆశోక్, తాండ్ర మల్లికార్జున్ పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసే ఆకర్షితులవుతున్నారు..
నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి చూసే చాలామంది ఇతర పార్టీ నాయకులు ఆకర్షితులవుతున్నారని రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పడకంటి వీరేశంతోపాటు ముగ్గురు వార్డు సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు 150 మంది, లలితాపూర్ గ్రామానికి చెందిన మండల యాదవ సంఘం అధ్యక్షుడు నల్లంగి కొమురయ్యతోపాటు 50 మంది ఆదివారం రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు రసమయికి గ్రామస్తులు బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. జడ్పీ సభ్యుడు సుగుణాకర్, ఎంపీటీసీ సభ్యులు మల్లేశం, శంకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లగల్ల నగేశ్, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శేఖర్‌గౌడ్, టీఆర్‌ఎస్ గ్రామాధ్యక్షుడు రామస్వామి, నాయకులు పాకాల పురుషోత్తంరెడ్డి

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...