రెడ్డి సంఘానికి చేయూత


Mon,November 12, 2018 01:12 AM

-వారి ఆశీర్వాదం తీసుకొని, బీ-ఫాం తీసుకునేందుకు వెళ్తుండడం ఆనందంగా ఉంది..
-70 ఏళ్లలో చేయని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి, చూపించాం
-టీఆర్‌ఎస్ కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి గంగుల కమలాకర్
టవర్‌సర్కిల్: రెడ్డి సంఘానికి చేయూతనందించడం తన బాధ్యతని టీఆర్‌ఎస్ కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని పద్మానాయక కల్యాణ మండపంలో గంగుల కమలాకర్‌కు రెడ్డి ఆత్మీయ ఆశీర్వాద సభ నిర్వహించారు. నియోజవర్గంలోని సుమారు 2వేల మంది ఈ సభలో పాల్గొని, ఆయనకు ఆశీర్వాదం అందజేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు తామంతా పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ సభలో పాల్గొన్న గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రెడ్డి కులస్థుల ఆత్మీయ ఆశీర్వాదం అందుకొని బీ-ఫాం తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్తుండడం సంతోషంగా ఉందని ఉద్వేగభరితంగా చెప్పారు. రెడ్డీలు తమ బిడ్డగా తనను ఆదరించి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పారు. రెడ్డి సంఘం కార్యాలయం ముందు నుంచి రూ. కోటి వ్యయంతో రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలను తక్షణం విడుదల చేశాననీ, ఇంకా ఏమైనా అవసరముంటే ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమన్నారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎందరో రాజకీయ నాయకులు కీలక పదవులు నిర్వహించినప్పటికీ ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయారన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో చేసి చూపించామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సీఎంగా కేసీఆర్ అయ్యాక నగరానికి ఐటీ పార్క్, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్‌ఫ్రంట్ మంజూరుతోపాటు స్మార్ట్‌సిటీ హోదా దక్కాయన్నారు. మహాకూటమికి ఓటేస్తే రాష్ట్రం ఆంధ్ర నాయకుల చేతుల్లోకి వెళ్లడంతోపాటు ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుకట్టపడుతుందనీ, మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ ఆశీర్వాద సభలో మాజీ ఎమ్మెల్యేలు వుచ్చిడి మోహన్‌రెడ్డి, కోడూరి సత్యనారాయణగౌడ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఆకారపు భాస్కర్‌రెడ్డి, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ ఎడవెల్లి విజేందర్‌రెడ్డి, ఒంటెల సత్యనారాయణ, మూల ప్రభాకర్‌రెడ్డి, ఒంటెల సత్యనారాయణరెడ్డి, ధ్యావ మధుసూదన్‌రెడ్డి, గుర్రం భూంరెడ్డి, గూడ గౌతంరెడ్డి, చాడ రవీందర్‌రెడ్డి, ఎడబోయిన శ్రీనివాస్‌రెడ్డి, బేతి రాజిరెడ్డి, చోలేటి రాజిరెడ్డితోపాటు నియోజకవర్గపరిధిలోని రెడ్డి కులస్థులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.

మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో..
ఉదయం మహిళా డిగ్రీ కళాశాలలో ఆవరణలో గంగుల కమలాకర్ వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాకర్స్‌తో కలిసి మైదానంలో సరదాగా వాలీబాల్, షటిల్ ఆడారు. కార్పొరేటర్ వై. సునీల్‌రావు, కలర్ సత్తన్న, సత్తినేని శ్రీనివాస్, మాచర్ల ఎల్లాగౌడ్, ఉమెన్స్ కళాశాల వాకర్స్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.
గంగుల సతీమణి ప్రచారం..
నగరంలోని 45వ డివిజన్‌లో గంగుల సతీమణి రజిత ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జ్యోతినగర్‌లోని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు ఓటు వేయాలని కోరారు. అనంతరం కాలనీలోని దుకాణంలో కూరగాయలు విక్రయించారు. కర్రె రాజు, కొమురయ్య, బండారి కొమురయ్య, గద్దల వీరేశం, బైర అశోక్, కర్రె బీరయ్య, లావణ్య, మేకల రమేశ్, దేవిక, కర్రె పద్మ,అంజలి, మల్లేశం పాల్గొన్నారు.

కాంపిటేటివ్ లెక్చరర్స్ మద్దతు
గంగుల కమలాకర్‌కు తెలంగాణ కాంపిటేటివ్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా బాధ్యులు మద్దతు ప్రకటించారు. గీతాభవన్ సమీపంలోని సంఘం కార్యాలయంలో గంగులను సత్కరించి, రాబోయే ఎన్నికల్లో ఆయనను భారీ మోజార్టీతో గెలపించుకుంటామన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు టీ కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ బీ సంతోష్, ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఏ చారి, సలహాదారుడు మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

210
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...