పెద్దల ఆనంద ఆదివారం విజయవంతం


Mon,November 12, 2018 01:12 AM

కరీంనగర్ కల్చరల్: ఎల్డర్స్ క్లబ్, సీనియర్ సిటిజన్స్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో రెండోసారి, జిల్లాలో తొలిసారి నిర్వహించిన పెద్దల ఆనంద ఆదివారం విజయవంతమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఆరోగ్య పరీక్షలు, ఆటలు, పాటలు, నృత్యాలు, ఉపన్యాసాల కార్యక్రమాల్లో 300 మంది పెద్దలు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ ట్రస్టీ మందాడి క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ, వచ్చే నెలల్లో మూడుతరాల కుటుంబ సభ్యుల మరుపురాని కలయికల పేరుతో సమావేశాల్ని నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు కిన్నెర నాగచంద్రికాదేవి, మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో క్రమంతప్పకుండా నిర్వహిస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు సముద్రాల జనార్దన్‌రావు మాట్లాడుతూ, అపోలో దవాఖానలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరం విజయవంతమైందన్నారు. లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు ఏ శ్రీనివాస్, ఎల్డర్స్ క్లబ్ కన్వీనర్లు ఎం. గంగాధర్, కేఎస్ నారాయణ, హౌసింగ్‌బోర్డు, బ్యాంక్ కాలనీ, చింతకుంట, హుజూరాబాద్ సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం నాయకులు ఎంవీ నర్సింహారెడ్డి, టీ ఆనందం, శంకరయ్య, న్యాయవాది కే తిరుపతి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆటలు, పాటలు పోటీల్లో విజేతలకు, వలంటీర్లు ఆజం, మల్లేశానికి అతిథులు, నిర్వాహకులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...