ఓటు వజ్రాయుధం


Tue,September 25, 2018 01:11 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ/టవర్‌సర్కిల్: ఓటు వజ్రాయుధం లాంటిదనీ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేయించుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. సోమవారం ఉదయం నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో డిగ్రీ, పీజీ విద్యార్థులచే ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన ర్యాలీని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకొని, దేశాభివృద్ధ్దిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారంతో ఓటరు నమోదు కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన వారిని వందశాతం ఓటర్లుగా నమోదు చేయించేందుకు ఇంటింటా సర్వే నిర్వహించామని తెలిపారు. ఇంతవరకు 28వేల ఓటరు నమోదు ఫారం-6 దరఖాస్తులు అందాయనీ, మంగళవారం లోగా మరో 10వేల దరఖాస్తులు అందే అవకాశం ఉందని వివరించారు.

వీటిని పరిశీలించి ఓటరు జాబితాలో నమోదు చేస్తామని తెలిపారు. కాగా, ర్యాలీ అంబేద్కర్ స్టేడియం నుంచి సిక్‌వాడీ, టవర్‌సర్కిల్, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్, ప్రతిమ మల్టీప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట విద్యార్థులచే కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు సమర్పించిన ఫారం-6 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్యామ్‌ప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ ఉప సంచాలకురాలు పద్మావతి, జిల్లా యువజన, క్రీడాధికారి గుగులోతు అశోక్‌కుమార్, డీవైఎస్‌వో కార్యాలయ సూపరింటెండెంట్ సిద్ధారెడ్డి, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కే రామకృష్ణ, రాష్ట్ర యువజన అవార్డీ సత్తినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, నగరంలోని శుభం గార్డెన్స్, మహిళా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. మహిళా డిగ్రీ కళాశాలలోని ఓటరు అవగాహన కేంద్రం, కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సహాయ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

నమోదు చేయించుకోవాలి: గంగుల
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటరుగా నమోదు చేయించుకోవాలని తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. రాంనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన కేంద్రాన్ని పరిశీలించారు. కార్పొరేటర్ శ్రీకాంత్, నాయకులు చల్లా హరిశంకర్, సుంకపాక విద్యాసాగర్ ఉన్నారు.

ఓటుహక్కు పొందాలి..: మేయర్
ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకొని, లేకుంటే పారం-6 సమర్పించి ఓటుహక్కు పొందాలని నగర మేయర్ రవీందర్‌సింగ్ సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, పిట్టల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, శ్రీనివాస్ వెంట ఉన్నారు.

ఆకట్టుకున్న ఫ్లాష్‌మాబ్..
ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తూ నగరంలోని తెలంగాణ చౌక్‌లో విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ఆకట్టుకుంది. దేశభక్తి గీతాలపై నృత్యాలు చేశారు. కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్,అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, ఆర్డీవో ఆనంద్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ ఉప సంచాలకురాలు పద్మావతి, డీవైఎస్‌వో అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

యువత పాత్ర కీలకం
హౌసింగ్‌బోర్డుకాలనీ: ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర కీలకమని జేసీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ పేర్కొన్నారు. స్థానిక ఎస్సారార్ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు హక్కు, వినియోగం పై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కల్వకుంట రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

197
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...