టీఆర్‌ఎస్ గ్రామాధ్యక్షుడికి నాయకుల పరామర్శ

Sun,September 23, 2018 03:00 AM

హుజూరాబాద్ రూరల్: మండలంలోని తుమ్మనపల్లి టీఆర్‌ఎస్ గ్రామాధ్యక్షుడు బేతి రాజిరెడ్డి కుమారుడు అశోక్‌రెడ్డి(18) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. అశోక్‌రెడ్డి పుట్టుకతోనే పోలియోతో మంచానికే పరిమితమయ్యాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశాడు. దీంతో రాజిరెడ్డితోపాటు కుటుంబ సభ్యులను సింగిల్ విండో చైర్మన్ ఏనుగు సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెళ్లి కొండాల్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ దాసిరి రమణారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు యాళ్ల శ్రీనివాస్‌రెడ్డి, బద్దం రాజేశ్వర్‌రెడ్డి, గూడూరి ప్రతాప్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, నందిరెడ్డి, మొలుగూరి ప్రభాకర్, చిరంజీవిలు పరామర్శించారు. ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

211
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles