గణేశుడికి ప్రత్యేక పూజలు

Sat,September 22, 2018 12:41 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని పలు గణేశ్ మండపాల్లో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అల్గునూర్, తిమ్మాపూర్‌లోని రచ్చబండ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో మహిళలు కుంకుమ పూజలు చేశారు. నుస్తులాపూర్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

శంకరపట్నం: కేశవపట్నంలో రథశాల వీధిలో వినాయక మండపం వద్ద శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గీతాపారాయణం, హనుమాన్ చాలీసా పఠించి భజనలు చేశారు. నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో గీతా ప్రచారకుడు మర్యాల తిరుపతయ్య, హనుమా న్ ఆలయ నిర్వాహకుడు తనుకు ఓం కారం, అల్లెంకి మనోహర్, భూపతి శంకరానందం, రాచర్ల మల్లేశం, వీరస్వామి, ప్రవీ ణ్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చిగురుమామిడి: వినాయక నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల్లో మండపాల వద్ద భక్తులు శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించారు. దీపారాధనలు, నైవేద్యాలు సమర్పించి మొ క్కులు తీర్చుకున్నారు. రాజన్నపల్లె లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో పురోహితుడు గంగు నాగేశ్వరశర్మ స్థానిక అంగన్‌వాడీ చిన్నారులకు పలకలు అందజేశారు. అంగన్‌వాడీ టీచర్ మంజుల, తదితరులు పాల్గొన్నారు.

తిమ్మాపూర్ రూరల్: మండలంలోని రామకృష్ణకాలనీలోని ఉపగ్న హోమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో గ ణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అతిఫ్‌ఖాన్, విగ్ర హ దాత రాంరెడ్డి, సభ్యులు బండి రాజు, రజినికర్‌రెడ్డి, ప్రభాకర్, కనకయ్య, కొమురయ్య, మం జుల, సమత పాల్గొన్నారు.

గన్నేరువరం: మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో యువ యూత్ సభ్యులు నెలకొల్పిన గణేశ్ మండపం వద్ద శుక్రవారం అన్నదానం నిర్వహించారు. మాజీ సర్పంచ్ సొల్లు అజయ్‌వ ర్మ, మాజీ ఉపసర్పంచ్ లింగంపెల్లి శంకర్‌లు భక్తులకు అన్నం వడ్డించారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు న్యాలపట్ల రాజు, సభ్యులు నాగపూరి సతీశ్, ్ల క్రాంతి, కరుణాకర్, అరవింద్, త్రిశూల్, శివ, రాజు, మురళి, గ్రామస్తులు పాల్గొన్నారు.

మానకొండూర్ రూరల్: మండలంలోని కొండపల్కల, ముంజంపల్లి, శ్రీనివాస్‌నగర్, చెంజర్ల, అన్నారం, లలితాపూర్ గ్రామాల్లో ఏకదంతుడికి శుక్రవారం మహిళలు కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో శివగణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, దాతలు మాడ రాజిరెడ్డి, మల్లారెడ్డి, పాశం బ్రహ్మరెడ్డి, కాటం కనకయ్య, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ కడారి ప్రభాకర్, సం పత్, శ్రీనివాస్, అనిల్, నాయకులు పాల్గొన్నారు.

మానకొండూర్: మండల కేంద్రంలోని పల్లెమీదచౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం మహిళలు కుంకుమ పూజలు చేశారు. గణేశ్‌నగర్, సంజీవనగర్, తూర్పు దర్వా జ, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మండపాల్లో అన్నదానం నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

336
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles