మంత్రి ఈటల సుడిగాలి పర్యటన


Fri,September 21, 2018 01:30 AM


హుజూరాబాద్‌టౌన్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి ఈటల రాజేందర్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. విద్యానగర్‌లో, గాంధీనగర్, బుడిగజంగాలకాలనీ, బండఅంకూస్‌వాడ, హనుమాన్‌టెంపుల్, మార్కెట్ ఏరియాల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాల వద్ద మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. 16వ వార్డులోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. భవనానికి రంగులు వేయాలనీ, ప్రహరీ నిర్మించాలనీ, అందుకు అవసరమైన నిధుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాలని ఆదేశించారు. బుడిగజంగాల కాలనీలో తిరిగి మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధుల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎస్సారెస్పీ ఉప కాలువ నీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయని కాలనీవాసులు చెప్పగా పరిశీలించి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ అధ్యక్షురాలు మంద ఉమాదేవి, ఉపాధ్యక్షురాలు తాళ్లపల్లి రజిత, టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండాల్‌రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు కొమురారెడ్డి, కొలిపాక శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, వినాయక మండపాల నిర్వాహకులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...