ఈటలకు అండగా ఉంటాం


Fri,September 21, 2018 01:30 AM

హుజూరాబాద్, నమస్తే తెలంగాణ/హుజూరాబాద్ టౌన్/జమ్మికుంట: ఉద్యమ బిడ్డగా వచ్చి, నియోజకవర్గ అభివృద్ధ్ది కోసం శాసన సభ్యుడిగా, మంత్రిగా అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌కు అండగా నిలిచి, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గోపు కొంరారెడ్డి అధ్యక్షతన గురువారం పట్టణంలోని సాయిరూపా ఫంక్షన్‌హాల్‌లో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో మిగిలి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలను మంత్రి ఈటల దృష్టికి తీసుకెళ్తామని కొంరారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఏ కొండాల్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు పొలంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దాసరి రమణారావు తెలిపారు. గత ఐదు సార్లు పోటీ చేసిన ప్రతీసారీ మెజార్టీనిస్తున్న మండలంగా ఇక్కడి ప్రజలకు గుర్తింపు ఉందనీ, త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే రీతిలో మళ్లీ భారీ మెజార్టీతో ఈటలను గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పటికే గ్రామాల్లో కుల సంఘాలు, యువజన సంఘాలు ఏకగ్రీవంగా కారు గుర్తుకే ఓటేస్తామని నిశ్చయించుకున్నట్లు చెప్పారు.

ఈటలకే మా మద్దతు
హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్, రాంపూర్ గ్రామ రజక సంఘం వారు మండల రజక సంఘం అధ్యక్షుడు సుంకరి రాజమౌళి అధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. వంద మంది మహిళలలు కారు గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని నిర్ణయించుకున్నారు. రజక సంఘం నాయకులు శ్రీనివాస్, కొండపాక శ్రీనివాస్, కొండపాక రవి, సుంకరి శ్రీనివాస్, మహేశ్, ప్రణయ్, కొమురయ్య, చంద్రయ్యతోపాటు తదితరులున్నారు.

ఈటలకే ఓటేస్తాం..
మంత్రి ఈటల రాజేందర్‌కే మా ఓటు.. అంటూ జమ్మికుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన గీత పారిశ్రామిక సంఘం నాయకులు, సభ్యులు నినదించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో వారు ఈటలను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నిశ్చయించారు. ఇక్కడ తిరుపతి, సంపత్, రమేశ్, కోటి, శరభయ్య, మొగిలి, వెంకటేశ్, సాంబయ్య, లింగయ్య, భూమయ్య, రవీందర్, రాజయ్య, చంటయ్య, రవి, సతీశ్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

149
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...