క్షతగాత్రులు కోలుకుంటున్నారు

Thu,September 20, 2018 01:46 AM

కరీంనగర్ హెల్త్ : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తాపడిన ఘటనలో గాయపడిన 36 మంది క్షతగాత్రులను కరీంనగర్‌లోని ఆరు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. కాగా అందరూ కోలుకుంటున్నారని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 మందికి వివిధ శస్త్ర చికిత్సలు చేయించినట్లు పేర్కొన్నారు. మరో ఐదుగురికి శస్త్ర చికిత్స చేయించడానికి వైద్యులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్షతగాత్రులకు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రి పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ముగ్గురు నిపుణులైన వైద్యుల కమిటీ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఒకరు డిశ్చార్జి చేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం సన్‌షైన్ దవాఖానలో 10 మంది, అఖీర దవాఖానలో ఐదుగురు, ప్రతిమలో 13 మంది, చల్మెడలో నలుగురు, మెడికేర్‌లో ముగ్గురు, రేనె దవాఖానలో ఒకరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

187
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles