గుండెల నిండా.. గులాబీ జెండా


Thu,September 13, 2018 01:22 AM

-ఊరూరా పెరుగుతున్న తీర్మానాలు
-టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని ప్రతిజ్ఞలు
-కొనసాగుతున్న చేరికలు
-చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి, సీనియర్ నాయకుడు ఆకారపు భాస్కర్‌రెడ్డి, రిటైర్డ్ ఆర్డీఓ బైరం పద్మయ్య పార్టీలోకి..
-కాంగ్రెస్‌లో కలకలం
హుస్నాబాద్, నమస్తే తెలంగాణ/చిగురుమామిడి/సైదాపూర్: హుస్నాబాద్ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ఇందుకు కార్యకర్తలు, నాయకుల కృషి, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఎంతో అవసరమని తాజా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమరం మొదలైనందున కార్యకర్తలు సైనికుల్లా గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలన్నారు. గత ఎన్నికల్లో తనపై ఉన్న నమ్మకంతో 35వేల మెజార్టీతో గెలిపించారని, అప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. గత నాలుగేళ్ల మూడు నెలల్లో ప్రతి గ్రామానికి కనీసం 5నుంచి 10సార్లు వెళ్లానన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని తెలియజేసేందుకు పల్లెబాట పేరుతో గ్రామాల్లో పర్యటిస్తామన్నారు. గ్రామస్థాయిలో సమావేశాలు పెట్టి పది మందితో రెండు రోజుల్లో బూత్ కమిటీలు వేయాలన్నారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఐక్యంగా ఉండి గతంలో కంటే రెట్టింపు మెజారిటీ వచ్చేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు కొండగట్టు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారితో పాటు ఇటీవల మృతిచెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. రాష్ట్ర గొర్రెల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీలు భూక్య మంగ, ఉప్పుల స్వామి, సంగ సంపత్, తంగెడ శాలిని, జడ్పీటీసీలు లక్ష్మణ్, వీరమల్ల శేఖర్, బిల్ల వెంకట్‌రెడ్డి, రాంచందర్‌నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

209
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...