ముక్త కంఠంతో..

Thu,September 13, 2018 01:22 AM

-ఈటలకు మద్దతుగా గౌడన్నల తీర్మానం
వీణవంక: మునుపెన్నడూ లేని విధంగా గౌడ కులస్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందరన్నకే తమ మద్దతు అంటూ వీణవంక మండలంలోని గౌడ కులస్థులు తీర్మానం చేశారు. రెడ్డిపల్లి గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశమై, ఈటలకే ఓటు వేస్తామని ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేశారు. తీర్మాన పత్రాన్ని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారముల్ల కొమురయ్య, జడ్పీ సభ్యుడు దాసారపు ప్రభాకర్‌కు అందజేశారు. అనంతరం సుమారు 100 బైక్‌లతో ఎల్లమ్మ గుడి నుండి వీణవంక వరకు ర్యాలీ తీయగా ఎంపీపీ కర్ర జయ, రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈటల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ సాదవరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ బాలకిషన్, గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాడగోని బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

గంగులను గెలిపించుకుంటాం
కొత్తపల్లి/కరీంనగర్‌రూరల్: వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌ను మళ్లీ గెలిపించుకుంటామని రేకుర్తి, బావుపేట, దుర్శేడ్ గ్రామాల ప్రజలు తీర్మానించుకుని, ప్రతిజ్ఞ చేశారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో మాజీ సర్పంచ్ నందెల్లి పద్మప్రకాశ్ ఆధ్వర్యంలో సుమారు నాలుగువందల మంది ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బావుపేటలో మాజీ సర్పంచ్ దావ వాణి కమలమనోహర్ ఆధ్వర్యంలో గంగుల కమలాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడ్‌లో వెలమ, గౌడ, మాల, మాదిగ, పద్మశాలి, నేతకాని, తెలంగాణ బేడ బుడిగ జంగాలు, మహిళా సంఘాలు ఏకతాటిపైకి వచ్చి గంగుల కమలాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీటీసీలు పెంచాల ఆంజనేయులు, కోరుకంటి శోభ వేణుమాధవరావు, నాయకులు సుంకిశాల సంపత్‌రావు, రామోజు తిరుపతి, నలువాల విజయ, పెంచాల ప్రభాకర్, రెడ్డ వేణి మధు, నలువాల సాయికిశోర్, తదితరులు పాల్గొన్నారు.

రసమయికే మా ఓటు
తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ/గన్నేరువరం: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌కే తమ ఓటంటూ తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గొల్ల కుర్మలు, గన్నేరువరం మండలంలోని సాంబయ్యపల్లి గ్రామస్తులు ప్రతినబూనారు. భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. సాంబయ్యపల్లిలో టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు చింతలపెల్లి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు ప్రతి పక్ష నాయకులు దయ చేసి మా ఊరికి రావద్దు.. మమ్మల్ని ఓట్లు అడిగి ఇబ్బంది పెట్టద్దు అని కోరుతూ గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఉల్లెంగుల ఏకానందం, గ్రామశాఖ అధ్యక్షుడు ఇనుకొండ మురహరిరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ పుప్పాల కనుకయ్య, సాంబయ్యపల్లి గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం కరుణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈటలను గెలిపిస్తామని యూత్ ప్రతిజ్ఞ
హుజూరాబాద్ రూరల్: కాట్రపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్ యూత్ మండలాధ్యక్షుడు తొగరు భిక్షపతి ఆధ్వర్యంలో యూత్ సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటలను మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. టీఆర్‌ఎస్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాలీక్ హుస్సేన్, నాయకులు భిక్షపతి, రమేశ్, శివకృష్ణ, రాజు, రవీందర్, సాంబశివచారి, సంఘాల రాజు, చంద్రమౌళి పాల్గొన్నారు.

251
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles