ముస్తాబైన వినాయక మండపాలు


Thu,September 13, 2018 01:21 AM

కరీంనగర్ కల్చరల్: గణపతి నవరాత్రోత్సవాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ కమిటీలు, దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో మండపాలను సిద్ధం చేశారు. డెకోరేటర్స్ మండపాలకు విద్యుద్ధీపాలంకరణలు, రంగు రంగుల వస్ర్తాలు అలంకరించారు. కలకత్తా, రాజస్థాన్‌ల నుంచి వచ్చిన డెకొరేటర్స్ మండపాలను అతి పెద్దవిగా నిర్మించి, చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఒక్కో మండపానికి రూ. 20 వేలు మొదలుకొని రూ. లక్షకు పైగా వ్యయం చేస్తున్నారు. నగరంలోని టవర్‌సర్కిల్, గంజ్, బోయవాడలో అతి పెద్ద మండపాలు నిర్మించారు. గురువారం సాయంత్రం ఆయా మండపాల్లో గణనాథుడు తొలి పూజలు అందుకోనున్నాడు.

మార్కెట్‌లో సందడి..
వినాయక చవితికి కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరగా, మార్కెట్‌లో సందడి నెలకొంది. మామిడి ఆకులు, పూలు, వత్తులు, ఎలక పండ్లు, పత్రి, రావిలాంటి 20 రకాల ఆకులను కొనుగోలు చేశారు. అలాగే, ఇండ్లలో పెట్టుకుని పూజించేందుకు వినాయక విగ్రహాలను కొనుగోలు చేశారు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...