మెరుగైన వైద్యం అందించండి..


Thu,September 13, 2018 12:59 AM

- డీఎంహెచ్‌ఓను కోరిన ఎంపీ వినోద్
కరీంనగర్ హెల్త్ : కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడి జిల్లా కేంద్రంలోని వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాతను కోరారు. బుధవారం సాయంత్రం క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్‌కు తరలించిన క్షతగాత్రుల్లో మంగళవారం రాత్రి వరకు ఐదుగురు మరణించగా మరో ఇద్దరు బుధవారం మృతిచెందారు. నగరంలోని అఖీర, సన్‌షైన్, ప్రతిమ, చల్మెడ దవాఖానాల్లో ఇంకా కొంత మంది చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితిపై ఎంపీ వైద్య, ఆరోగ్య అధికారిని అడిగి తెలుసుకున్నారు. వీరికి ఇక్కడే మెరుగైన వైద్యం లభిస్తే చికిత్స చేయాలనీ, లేదంటే హైదరాబాద్ తరలించి వైద్యం చేయించాలని ఆదేశించారు. క్షత గాత్రుల పరిస్థితిని ఎప్పటికపుడు తెలుసుకోవాలని, విషమ పరిస్థితిలో ఉన్న వారిని హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరిని, జగిత్యాలలో చికిత్స పొందుతున్న మరొకరిని ఎంపీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అలాగే జగిత్యాలలో చికిత్స పొందుతున్న ఐదుగురిని నగునూర్‌లోని ప్రతిమ దవాఖానాకు తరలించారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యులను ఎంపీ సూచించారు.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...