ముస్లింలకు ఎనలేని గౌరవం ఇచ్చారు


Wed,September 12, 2018 03:09 AM

జమ్మికుంట: పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీలంతా మంత్రి ఈటల రాజేందర్‌కే మా ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మంగళవారం పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్‌లో ముస్లిం నాయకులు ఎంఏ హుస్సేన్, జకీర్, తదితర ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలంతా సమావేశం కాగా, ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి, ఇచ్చిన నిధులు, సంక్షేమంపై చర్చించారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, నాయకులు ముస్లింలకు ఇవ్వలేని గౌరవాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. మరోసారి హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఈటలను సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌కు వెన్నంటి ఉంటామని వాగ్దానం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తీర్మానం చేశారు. నాయకుల తీర్మానానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. ఇందులో సిరాజ్ సుల్తానా, జమీర్, ఖదీర్, వహీద్, ఫసీ, షేక్ హుస్సేన్, నసీర్, గఫార్, ఇమ్రాన్, రాజ్‌కుమార్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

177
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...