జమ్మికుంట: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భక్తులు ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని పట్టణ సీఐ సృజన్‌రెడ్డి సూచించారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఉత్సవ కమిటీలతో సీఐ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, డీజే సౌండ్స్‌ను పెట్టి ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీలదేనని చెప్పారు. నిమజ్జనంలో సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగాలన్నారు. మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలో చోటుచేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పట్టణం, మండలంలో పలు ఉత్సవ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.