హిందూ ఉత్సవ సమితి కమిటీ ఎన్నిక

Wed,September 12, 2018 03:09 AM

హుజూరాబాద్ రూరల్: గణేశ్ నిమజ్జన, వివిధ హిందూ ఉత్సవాల నిర్వహణకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నందగిరి మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా సదాశివరెడ్డి, భూం సాయికృష్ణ, గౌరవాధ్యక్షుడిగా ఎర్రం రాజన్న, ప్రధాన కార్యదర్శిగా జెల్ల సుధాకర్, కోశాధికారిగా కొమురవెళ్లి రాజు, సహాయ కార్యదర్శులుగా రాణాసింగ్, నల్లగోని నవీన్, ప్రచార కార్యదర్శిగా కేశవ్, కార్యవర్గ సభ్యులుగా భరత్, రాకేశ్, ఒజ్జల భరత్, శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి బుర్ర నటరాజ్, ఉపాధ్యక్షుడు సుధాకర్‌రావు, ఉత్సవ కమిటీ వ్యవస్థాకుడు కందుల శ్రీనివాస్‌రెడ్డి, వీహెచ్‌పీ మండలాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

164
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles