గ్రంథాలయ అభివృద్ధికి నిధుల మంజూరుపై హర్షం

Wed,September 12, 2018 03:08 AM

హుజూరాబాద్‌టౌన్: పట్టణంలోని గ్రంథాలయం అభివృద్ధికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ రూ.18లక్షల 40వేల నిధులు మంజూరు చేయడంపై గ్రంథాలయ సంరక్షణ సమితి నాయకులు హర్షం వ్యక్తంచేశారు. మంగళవారం సమావేశమైన వారు మాట్లాడుతూ.. నిధులు మంజూరు చేసిన మంత్రితో పాటు, ఇందుకు కృషి చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్‌రెడ్డి, డైరెక్టర్ కోడిగూటి మొగిలి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాంపెల్లి సమ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ నటరాజ్, కార్యదర్శి ప్రతాప రమేశ్, సహాయ కార్యదర్శి గణేశ్, సలహాదారులు పాల్గొన్నారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles