అల్లర్లు సృష్టించే వారిపై నిఘా


Tue,September 11, 2018 01:24 AM

కరీంనగర్ క్రైం : ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టించే వారిపై నిఘా ఉంచాలని సీపీ కమలాసన్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. స్టేషన్ల వారీగా తీసుకునే బందోబస్తుకు సంబంధించిన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సోమవారం కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులతో సీపీ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అల్లర్లు సృష్టించే వారి సమాచారం, వా రిపై నిఘా ఉంచడం వల్ల నేరాలను నియంత్రించే అవకాశం ఉందన్నారు. ఎన్నికల నియమావళిలోని ప్రతి అంశంపై పోలీసు అధికారులు అవగాహన కల్గి ఉండాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చర్యలకు పాల్పడినా రౌడీషీటర్లు, అనుమానితులకు సంబంధించిన వివరాలను రెండ్రోజుల్లోగా నివేదించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, సంజీవ్‌కుమార్, ఏసీపీలు వెంకటరమణ, ఉషారాణి, కృపాకర్, శ్రీనివాస్, రాగ్యానాయక్‌తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...