టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు

Mon,September 10, 2018 01:19 AM

-స్వార్థం కోసం వచ్చి తప్పుడు ఆరోపణలు
-సిట్టింగ్‌లకే టిక్కెట్లిస్తామని చెప్పినప్పుడే ఎందుకు పోలె..
-కరీంగనర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల ధ్వజం
-స్వార్థపరుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపు
-ఉమ్మడి జిల్లాలో 13 సీట్లు టీఆర్‌ఎస్‌కే ఖాయమని స్పష్టం
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ స్వార్థం కోసం పార్టీలో చేరి ఇప్పుడు తమను మోసం చేశారంటూ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదిన్నర క్రితం నుంచే సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరు టీఆర్‌ఎస్‌లోకి వచ్చి తమ సొంత పనులు చేసుకొని ఇప్పుడు పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోరుట్లకు చెందిన జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీలోనే అనేక పదవులు అనుభవించారనీ, 2014లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయి, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చారనీ, ఇప్పుడు మళ్లీ తనను పార్టీ మోసం చేసిందంటూ విమర్శలు చేయడం సరికాదని హితవుపలికారు. అసలు అతనికి పార్టీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. కేవలం తమ సొంత పనుల కోసం పార్టీలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక నుంచి ఏ పార్టీ కూడా ఆయననను నమ్మదనీ, ఒక పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు గమనించాలని కోరారు. కేవలం సానుభూతి కోసం టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయవద్దని సూచించారు. ఇలాంటి వారి వల్ల పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. పార్టీపై, సీఎం కేసీఆర్‌పై అభిమానం ఉన్న వారే పార్టీలో ఉంటారని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ 13 సీట్లు గెలుస్తుందనీ, అన్నింటినిలోనూ 30 వేలకు పైగా మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు అందరూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పని చేయాలని సూచించారు. సమావేశంలో నగర మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ రమేశ్, కార్పొరేటర్లు ఎండీ ఆరిఫ్, వై సునీల్‌రావు, పెద్దపల్లి రవీందర్, బోనాల శ్రీకాంత్, నలువాల రవీందర్, నాయకులు చల్ల హరిశంకర్, ఎడ్ల అశోక్, జమీలొద్దీన్, ఒంటెల సత్యనారాయణరెడ్డి, తోట మధు, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

153
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles