గులాబీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలి

Mon,September 10, 2018 01:18 AM

-టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఎడ్ల జోగిరెడ్డి
-బూత్ కమిటీ సభ్యులకు భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం
తిమ్మాపూర్ రూరల్: గ్రామ, గ్రామాన టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయడానికి బూత్ లెవల్ కమిటీ సభ్యులు సైనికుల్లా పని చేయాలని పార్టీ మండలాధ్యక్షుడు ఎడ్ల జోగిరెడ్డి పిలుపు నిచ్చారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల, మల్లాపూర్, మొగిలిపాలెం గ్రామాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ కమిటీ సమావేశాలకు ఆయన టీఆర్‌ఎస్ నాయకుడు ఉల్లెంగుల ఏకానందంతో కలిసి హాజరై మాట్లాడారు. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేసే సమయం ఆసన్నమైందన్నారు. తిరిగి పార్టీ అధికారం సాధించే దిశగా పని చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం బూత్ లెవల్ కమిటీల జాబితాను పరిశీలించారు. వారికి వచ్చే ఎన్నికల గురించి దిశానిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ బూత్ లెవల్, గ్రామ శాఖ అధ్యక్షులు, ఆర్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
బూత్ కమిటీల ఏర్పాటు
మానకొండూర్ రూరల్: మండలంలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు ఆదివారం పార్టీ నాయకులు శాతరాజు యాదగిరి, గుర్రం కిరణ్‌గౌడ్, బోయిని వెంకటేశ్‌ల ఆధ్వర్యంలో రెండు బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ప్రతీ కమిటీలో 20 మంది చొప్పున సభ్యులను ఎంపిక చేసి, చేపట్టే విధి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దండబోయిన శేఖర్, శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

162
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles