ఆరోగ్య పథకాల అమలుపై ఆరా


Sun,September 9, 2018 01:30 AM

గంగాధర: మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ పథకాల అమలు తీరును నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రత్యక్షంగా గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇండియా రఘురాం మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్య సంక్షేమం కోసం 40 రకాల పథకాలను ప్రవేశపెట్టాయని పేర్కొన్నారు. గ్రామంలో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా ఇస్తున్నారా?, మందులు అందజేస్తున్నారా?, ప్రభుత్వ పథకాలు నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటున్నాయా? అనే విషయాలు తెలుసుకుంటున్నామన్నారు. కేంద్ర బృందం శ్వేతాసింగ్, ప్రదీప్‌చంద్రా, సందేశ్, డబ్ల్యూహెచ్‌వో సభ్యుడు జయకృష్ణ, రాష్ట్ర బృందం అరుణ్, రవితేజ, రఘునందన్, రంజిత్, జిల్లా వైద్యాధికారి సుజాత, గంగాధర పీహెచ్‌సీ వైద్యాధికారి సుజాత, సిబ్బంది రాజ్‌గోపాల్, రవీందర్,శ్రీనివాస్, విజయశ్రీ, పోచయ్య, జాకీర్, రవీందర్, పుష్పలీల, మరియ, తదితరులు పాల్గొన్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...