కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన

Sat,September 8, 2018 02:28 AM

మానకొండూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది. మండలకేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన శిబిరంలో 162 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 38 మందిని శస్త్రచికిత్సల కోసం కరీంనగర్ వైద్యశాలకు రెఫర్ చేశారు. 80 మందికి కండ్లద్దాలు, ఉచిత మం దులు అందజేశారు. మరో ఐదుగురికి ప్రత్యేక కండ్లద్దాల కోసం ఆర్డర్ చేశారు. క్యాంప్ ఇన్‌చార్జి డాక్టర్ నీలి సాగర్, నేత్రవైద్యుడు ప్రభాకర్, సీహెచ్‌ఓ సయ్యద్ ఆఫ్జల్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ రవికుమార్, సూపర్‌వైజర్ రాజు పాల్గొన్నారు.

శంకరపట్నం: మండలంలోని చింతలపల్లిలో శుక్రవారం రెండోరోజూ కంటి వెలుగు శిబిరం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఓ దివ్యాంగుడికి అధికారులు శిబిరం బయటికి వచ్చి పరీక్షలు చేసి మందులు, అద్దాలు అందజేశారు. అలాగే శుక్రవారం 167మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆప్తాలమిక్ అధికారి డాక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. 77 మందికి కంటి అద్దాలు ఇచ్చినట్లు తెలిపారు. మరో 75 మందికి ఆర్డర్ పెట్టినట్లు వెల్లడించారు. కంటి శుక్లాలు తదితర సమస్యలతో బాధపడుతున్న 16 మందిని కంటి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణుడు సులోక్‌నాథ్, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

220
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles