రసమయికి టికెట్ పై సంబురాలు


Sat,September 8, 2018 02:28 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: రసమయి బాలకిషన్‌కు కేసీఆర్ తిరిగి రెండోసారి టికెట్ ఇవ్వడంపై శుక్రవారం మహాత్మానగర్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పటాకలు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ సభ్యురాలు ఉల్లెంగుల పద్మ, ఎంపీపీ బూడిద ప్రేమలత మాట్లాడుతూ రసమయిని తిరిగి గెలిపించేందుకు ప్రతి కార్యకర్త నిర్విరామంగా కృషి చేయాలన్నారు. ఆయన సేవలు నియోజవర్గ ప్రజలకు అవస రమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పొన్నాల భూలక్ష్మి, తాజా మాజీ సర్పంచులు మాతంగి స్వరూప, మల్లెత్తుల పద్మ, టీఆర్‌ఎస్ నాయకులు నాయిని వెంకట్‌రెడ్డి, మాతంగి లక్ష్మణ్, పొన్నాల సంపత్, గవ్వ రవీందర్‌రెడ్డి, మల్లెత్తుల అంజయ్య, దుర్గా ప్రసాద్, అశోక్, బీరం మహేశ్వరి, కవ్వంపల్లి పద్మ, కోండ్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...