నాణ్యత లేకపోతే ఎలా..?

Thu,December 5, 2019 03:12 AM
-నాసిరకం రొయ్య పిల్లల పంపిణీపై మత్స్యకారుల ఫిర్యాదు
-నాణ్యమైన విత్తనాలు అందించండి : ఎమ్మెల్యే షిండే సూచన
-నిజాంసాగర్‌ ప్రాజెక్టులో రొయ్య పిల్లల విడుదల నిలిపివేత

నిజాంసాగర్‌,నమస్తే తెలంగాణ : నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నాణ్యమైన రొయ్య పిల్లలను విడుదల చేయాలని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అధికారులకు సూచించారు. బుధవారం నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ 20 ఫ్లడ్‌ గేట్ల వద్ద రొయ్యపిల్లలను జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎన్‌డీసీసీ డైరెక్టర్‌ నామాల శంకర్‌ రొయ్యల పంపిణీ సక్రమంగా జరగడం లేదని నాసిరకం రొయ్యల సీడ్‌ వచ్చిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రోజన్‌బర్డ్‌ జాతికి చెందిన రొయ్య పిల్లలు కాకుండా నాసిరకం పిల్లలు విడుదల చేస్తున్నారని వివరించారు.

పలువురు మత్స్యకారులు సైతం విడుదల చేస్తున్న రొయ్య పిల్లల్లో మలుగు పాపెర్ల పిల్లలు కూడా ఉన్నాయని వాటిని బుట్టలో పట్టుకుని వచ్చి ఎ మ్మెల్యేకు చూపించారు. దీంతో నాణ్యమైన రొయ్యల సీడ్‌ వేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రాజెక్టులో 18 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 80 వేల రొ య్య పిల్లలను విడుదల చేసి విడుదల నిలిపివేశారు. మ త్స్యశాఖ జేడీ శంకర్‌ రాథోడ్‌ ఫోన్‌లో ఉన్నతాధికారులతో రొయ్యల సీడ్‌ బాగాలేదని వివరించారు. 5 వాహనాల్లో సీడ్‌ రాగా, ఈ వాహనాలను తిరిగి పంపించారు. అదే విధంగా సింగీతం రిజర్వాయర్‌ కూడా రొయ్య పిల్లల పం పిణీ ఉండగా, ఈ కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎంపీపీ పట్లోల్ల జ్యోతి, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, పిట్లం ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గైని విఠల్‌, సీడీసీ చైర్మన్‌ దుర్గారెడ్డి, సర్పంచులు అనసూయ, ఎస్‌. సాయిలు, చందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేష్‌గౌడ్‌, నాయకులు అఫ్జల్‌, సత్యనారాయణ, రమేశ్‌, నాయకులు గంగారెడ్డి, గైని రమేశ్‌, బబ్బర్‌సింగ్‌, రెడ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన సీడ్‌ వస్తేనే విడుదల చేయిస్తాం
నాణ్యమైన రొయ్యల సీడ్‌ వస్తేనే ప్రాజెక్ట్‌లో విడుదల చేస్తామని ఎఫ్‌డీవో అవినాశ్‌ తెలిపారు. ప్రస్తుతం నిజాంసాగర్‌కు వచ్చిన రొయ్యల సీడ్‌లో నాణ్యత లేదని గుర్తించాం. ప్రాజెక్టులో రొయ్య పిల్లల విడుదల నిలిపివేశాం. మత్స్యకారులు ఆందోళన చెందవద్దని తెలిపారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles