బోధన్ రూరల్: మహిళలు అపదలో ఉన్నప్పుడు 100కు డయల్ చేస్తే పోలీసులు స్వతర సహాయ చర్యలు చేపడుతారని బోధన్ ఏసీపీ జైపాల్‌రెడ్డి అన్నారు. బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, మెప్మా, మహిళలకు ‘మహిళల భద్రత-చట్టాలు’పై బుధవారం అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద ఏ రూపంలోనైనా రావచ్చని హెచ్చరించారు. అపరిచితుల్ని నమ్మవద్దని, పోలీసుల సహాయాన్ని తీసుకోవాలని సూచించా రు.
రోడ్డుపైన సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని తెలిపారు. ఆపదను పసిగట్టిన వెంటనే 100కు ఫోన్ చేయడం లేదా హాక్ఐ యాప్‌లో పోలీసులకు సమాచారం అందించడం గుర్తించుకోవాలన్నారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఆటో, ట్యాక్సీ నంబర్‌ను ఫొటో తీసుకొని తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్నారు. మహిళలు తమ వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వాడవద్దని సూచించారు. సైబర్ క్రైమ్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయని, స్మార్ట్‌ఫోన్‌ను మంచి కోసం మాత్రమే వాడుకోవాలన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు.
హాక్ఐ యాప్ వాడకుంటూ పరిసరా ల్లో జరిగే అనైతిక ప్రమాదాల్ని పోలీసులు దృష్టికి తీసుకోచ్చేలా బాధ్యతగా మెలగాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ పల్లె రాకేశ్, బోధన్ తహసీల్దార్ గఫార్‌మియా, ఎంపీడీవో వేణుగోపాల్, బోధన్ ఎస్సైలు అంబ్రయ్య, మెగులయ్య, ఎంపీవో దుర్గాప్రమీల, ఎంఈవో శాంతకుమారి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సౌభాగ్య, వినోది తదితరులు పాల్గొన్నారు.