నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Thu,December 5, 2019 03:08 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ గురువారం శంకుస్థాపన చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు అశోక్‌నగర్‌ కాలనీలోని తీజ్‌ మంగళి దగ్గర పార్క్‌ ప్రహరీ నిర్మాణానికి, జీవీఎస్‌ కళాశాల సమీపంలో మున్సిపల్‌ ఖాళీ స్థలానికి ప్రహరీ నిర్మాణానికి, అశోక్‌నగర్‌లోని ఇంటిగ్రేటేడ్‌ హాస్టల్‌ దగ్గర ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

గిరిజన బాలికల హాస్టల్‌ దగ్గర సీసీరోడ్డు నిర్మాణ పనులకు, మధురానగర్‌ అంగన్‌వాడీ కేంద్రం వద్ద మున్సిపల్‌ ఖాళీ స్థలానికి ప్రహరీ నిర్మాణ పనులకు, ఆర్య నగర్‌లోని మున్సిపల్‌ పార్క్‌ నిర్మాణ పనులకు, కావేరి హోటల్‌ సమీపంలో వాటర్‌ పైప్‌లైన్‌ నిర్మాణ పనులకు, హౌసింగ్‌ బోర్డు కాలనీలో వాటర్‌ ట్యాంక్‌ ప్రహరీ నిర్మాణానికి, వికాస్‌నగర్‌లో, గోల్డెన్‌ ఎన్‌క్లేవ్‌లో, ఎఫ్‌సీఐ గోడౌన్స్‌లోని వాల్మీకి గుడి వద్ద, భూ పుత్ర కల్యాణ మండపం సమీపంలో మున్సిపల్‌ స్థలాలకు ప్రహరీ నిర్మాణాలకు, సైలానీబాబా కాలనీలోని మున్సిపల్‌ పార్క్‌ అభివృద్ధి పనులు, ప్రహరీ, ఓపెన్‌ జిమ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles