నర్సరీ ఏర్పాట్ల పనులు పూర్తి చేయాలి

Thu,December 5, 2019 03:07 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : నర్సరీ ఏర్పాట్ల పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నర్సరీల ఏర్పాటు, హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... నర్సరీల ఏర్పాటుకు సంబంధించి బోర్డు, గేట్‌, క్యాటర్‌ ట్రాప్‌, ఫెన్సింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
నూతన పంచాయతీ రాజ్‌ చట్టంపై


అవగాహన కల్పించాలి
నూతన పంచాయతీ రాజ్‌ చట్టంపై సర్పంచులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ శాఖ అధికారులకు సూచించారు.మొక్కలు ఎండిపోయిన స్థానంలో నూతన మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్పెషల్‌డ్రైవ్‌గా చేపట్టి ఈ నెల 12వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నెల 7వ తేదీలోగా డివిజన్‌కు 100 ట్రాక్టర్ల చొప్పున కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు.
ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి వెంకటేశ్‌ దోత్రే మాట్లాడుతూ... విద్యార్థినుల ఆత్మరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయులు శిక్షణ ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, కామారెడ్డి ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, డీపీవో నరేశ్‌ పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles