ప్రకృతిని పరిశీలించి నేర్చుకోవాలి

Wed,November 20, 2019 01:28 AM

బోధన్, నమస్తే తెలంగాణ: విద్యార్థులు చిన్నప్పటి నుంచే ప్రకృతిని, పరిసరాలను పరిశీలించాలని, పరిశీలన ద్వారానే సమాజంలో అనేక కొత్త ఆవిష్కరణలు జరిగాయని లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ పీవీ సుబ్బారావు అన్నారు. బోధన్ పట్టణం రాకాసిపేట్‌లోని ఇందూర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టిన్సీ విన్సీ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగు భాషను ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, తెలుగు భాషలో పట్టు సాధించటం ద్వారానే ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదించవచ్చని చెప్పారు. ఇందూర్ హైస్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ ఇందూర్ ప్రాథమిక పాఠశాలను ప్లాస్టిక్ రహిత పాఠశాలగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. ప్లాస్టిక్ వల్ల జరిగే వినాశనాన్ని విద్యార్థులు అవగాహన చేసుకుంటారన్నారు. కార్యక్రమంలో ఇందూర్ విద్యాసంస్థల సొసైటీ డైరెక్టర్ థామసయ్య, ఇందూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి తదితరులు మాట్లాడారు.

పనికిరాని వస్తువులతో ..
కార్యక్రమంలో భాగంగా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రదర్శన చిన్నారుల సృజనాత్మకతకు అద్దంపట్టింది. పనికిరాని వస్తువులు, వ్యర్థ పదార్థాలతో విద్యార్థులు తయారుచేసిన వస్తువులు ఈ ప్రదర్శనలో ఉంచారు. చిరిగిన బట్టలు, పడేసిన ప్లాస్టిక్ సీసాలతో వినూత్నంగా వస్తువులు, పరికరాలను తయారుచేశారు. జూట్‌తోనూ, పాత పేపర్లతోనూ, విరిగిపోయిన ఫర్నీచర్ కర్రలతోనూ వస్తువులు రూపొందించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నరకాసుర వధ నాటికను, నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించారు.

పొంచి ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి
ఖలీల్‌వాడి: క్రానిక్ అబ్ట్స్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ) అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల్లో అవరోధం కలిగించే వ్యాధి. ఈ వ్యాధిని తరిమికొట్టాలనే ఉద్దేశంలో ఏటా నవంబర్ 19న ప్రపంచ సీవోపీడీ డేగా నిర్వహిస్తున్నారని వైద్యులు తెలుపుతున్నారు.

వైద్యులు తెలిపిన వివరాల మేరకు..
సీవోపీడీపై ప్రత్యేక కథనం.. ఈ వ్యాధి ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకి, బయటకు గాలిని సరఫరా చేసే వాయునాళంలో ఏర్పడుతుంది. వాపు రావడం మూలంగా వాయునాళం సన్నబడుతుంది. దీంతో వాటి గుండా లోనికి వెళ్లే గాలిశాతం తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల ద్వారా వెలుబడిన గాలి బయటకు సరిగా వెళ్లలేదు. ఈ కారణంగా ఊపిరితిత్తులు బరువుగా (నిండుగా ఉన్నట్లుగా) చాతిపట్టేసినట్లుగా ఉంటుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇది అంటు వ్యాధి కాదు. ముఖ్యంగా పిల్లలకు సీవోపీడీ వ్యాధి రాదు. సాధారణంగా 40 ఏళ్ల పైబడిన వాకి వస్తుంది. 40 ఏళ్ల లోబడిన వారికి కూడా ఈ వ్యాధి రావొచ్చు. ముఖ్యంగా పొగ తాగిన వారికి ఈ వ్యాధి వెంటనే ప్రబలే అవకాశముంది. ఈ వ్యాధిని గుర్తించకపోవడం, సరైన చికిత్సపై అవగాహన లోపం మూలంగా మరణాల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం 1990లో మరణానికి కారణమైన వ్యాధులతో పోలిస్తే ఈ వ్యాధి 6వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ప్రపంచ వైద్య నిపుణులు అంచనా ప్రకారం 2020 వరకు 3వ స్థానానికి వెళ్తుందని అంచనా. అంటే ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.

వ్యాధి కారణాలు..
సీవోపీడీ రావడానికి అన్నింటికన్నా ముఖ్య కారణం పొగ త్రాగడం. పక్కవాళ్ల్లు తాగే పొగని పీల్చిన వారు కూడా ఈ వ్యాధితో బాధపడవచ్చు. కొంత మంది పొగతాగని వారిలో కూడా సీవోపీడీ రావచ్చు. వాళ్లు ఊపిరితిత్తులకు నష్టం కలిగించే వాతావరణంలో ఉంటే ఉదాహరణకు వంట పొయ్యి (కుంపట్లు), నుంచి గదిని వెచ్చగా ఉంచేందుకు పెట్టుకున్న హీటర్లు (సిగ్రి) నుంచి వచ్చే పొగ పీలుస్తుంటే సీవోపీడీ రావచ్చు. బొగ్గు గనులు, సిమెంట్, టెక్స్‌టైల్స్, రసాయనాలు వంటి దుమ్ముతో కూడుకున్న గాలి ఉన్న చోట పనిచేసే వ్యక్తులకు ఈ వ్యాధి పది నుంచి 20 శాతం వరకు వచ్చే అవకాశం ఉంది. లివర్ నుంచి విడుదలయ్యే ఆంటిట్రిప్సిన్ అనే ఎంజైమ్ లోపం వల్ల ఈ వ్యాధి రావచ్చు. అస్తమా (ఉబ్బసం) ఉన్న వ్యక్తుల్లో అస్తమాకు చికిత్స జరగకపోతే కూడా వారికి సీవోపీడీ రావచ్చు.

వ్యాధి లక్షణాలు
నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం. వ్యాధి ముదిరితే, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఆయాసం రావచ్చు. దీర్ఘకాలిక దగ్గు, తెమడ రావడం, కొన్ని సార్లు పొడిదగ్గు ఉండచ్చు. చాతిపట్టినట్లు ఉండడం. కొన్ని సార్లు పిల్లికూతలు రావచ్చు. అలసట, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, తాత్కాలిక స్పృహ కోల్పోవడం వ్యాధి ముదిరిన వారిలో కనిపిస్తాయి.

చికిత్స.. నివారణ
పొగతాగే వారైతే పొగ తాగడం మానేయాలి. పొగ తాగాలని అనిపిస్తే చూవింగ్ గమ్ నమలాలి. తాజా పండ్లను, కూరగాయలను తీసుకోవాలి. రోజూఎక్కువ నీరు తీసుకోవాలి. వాయినాళాలాన్ని వెడల్పు చేసే మందులను బ్రాంకోటై లేటర్స్ అంటారు. ఊపిరితిత్తుల్లోని వాయునాళాల చుట్టూ ఉన్న చిన్న కండారాలను గట్టి పరిచే చర్యను అవరోధించి, ఇంకా వెనక్కి మరలించడం ద్వారా ఈ మందులు పనిచేస్తాయి. సీవోపీడీ నుంచి ఉపశమనం కల్పిస్తాయి. తద్వారా మరింత శ్వాస పీల్చుకోవడానికి తోడ్పడతాయి.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles