ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన సదస్సు

Sun,November 17, 2019 02:22 AM

విద్యానగర్ : మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు చెందిన ప్రజలు తమ ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్‌తో క్రమబద్ధీకరించుకోవాలని ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ శైలజ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన దేవునిపల్లి, లింగాపూర్, అడ్లూర్, టేక్రియాల్, సరంపల్లి, పాతరాంజంపేట, రామేశ్వర్‌పల్లి గ్రామస్తులకు ఎల్‌ఆర్‌ఎస్‌పై శనివారం లింగాపూర్ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles