పేదల జీవితాల్లో కల్యాణ వెలుగులు

Sun,November 17, 2019 02:22 AM

కామారెడ్డి నమస్తే తెలంగాణ : నిరుపేదల ఆడబిడ్డల పెండ్లి కోసం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో కామారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 340 మంది లబ్ధిదారులకు సుమారు రూ. మూడు కోట్ల 44 లక్షల చెక్కులను శనివారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా గంపగోవర్ధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వం పని చేస్త్తోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధికి మార్గం ఏర్పడిందని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలోనే 11 నెలల కాలంలో 1305 మంది లబ్ధిదారులకు రూ.12 కోట్ల 67 లక్షలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసినట్లు చెప్పారు. ఆడబిడ్డల పెండ్లి చేసి తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఆడబిడ్డ పెండ్లికి ఆర్థికంగా ఆదుకొని పెద్దమామగా ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు బల్వంత్‌రావు, కుంబాల రవి యాదవ్, జూకంటి ప్రభాకర్‌రెడ్డి, కాళ్ల గణేశ్, గరిగంటి లక్ష్మీనారాయణ, కృష్ణాజి తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles