చదువుతోనే మెరుగైన భవిష్యత్తు

Sun,November 17, 2019 02:21 AM

విద్యానగర్ (రామారెడ్డి ) : చదువుతోనే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. రామారెడ్డి జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. కళాశాలలో పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. కళాశాలకు అవసరమైన నిధులను సమకూరుస్తానని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి జ్ఞానాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. అనంతరం పద్మ శ్రీనివాస్ కళాశాలకు ఇచ్చిన విరాళంతో నిర్మించిన వేదికను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి నాగరాజు, ప్రిన్సిపాల్ నిజాం, సర్పంచ్ సంజీ వ్, ఉపసర్పంచ్ ప్రసాద్, ఎంపీటీసీ రజిత, మండల కో ఆప్షన్ మెంబర్ గౌస్, తహసీల్దార్ జయంత్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles