విద్యానగర్ : జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు హరితహారం, 9,10 తరగతుల విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనపై వ్యాసరచన పోటీలు చేపట్టారు. పోటీలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్‌గౌడ్, కార్యదర్శి సురేశ్‌బాబు, అధ్యాపకుడు నారాయణరావు పరిశీలించారు. ఆదివారం ఉదయం 11.30కు కళాశాల విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్లాస్టిక్ నిర్మూలన అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.