వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

Sat,November 16, 2019 12:23 AM

లింగంపేట: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై సుఖేందర్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ వినియోగించాలని, వాహనపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, వాహనానికి బీమా చేసుకోవాలని సూచించారు. ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించవద్దని సూచించారు. ధ్రువ పత్రాలు లేకుండా తిరుగుతున్న 20 మంది వాహనదారులకు రెండు వేల రూపాయలు జరిమానాలు విధించినట్లు తెలిపారు.
ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలి
నాగిరెడ్డిపేట్ : వాహనదారులు ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని ఎస్సై మోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. పిల్లలు వాహనాలు నడిపిస్త్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
వాహనాల తనిఖీ
నస్రుల్లాబాద్: గ్రామ శివారులోని బాన్సువాడ-బోధన్ ప్రదాన రహదారిపై శుక్రవారం ఎస్సై సందీప్ వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారుల ధ్రువ పత్రాలను పరిశీలించి సరైన పత్రాలు లేనివారికి జరిమానాలు విధించినట్లు ఆయన తెలిపారు. వాహనదారులు తప్పకుండా ధ్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు రఘు, మహేశ్ తదితరులు ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles