ఆగని బస్సు ప్రయాణం..

Sat,November 16, 2019 12:23 AM

కామారెడ్డి, నమస్తేతెలంగాణ / విద్యానగర్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శుక్రవారం నాటికి 42వ రోజుకు చేరుకుంది. సమ్మె ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కామారెడ్డి బస్టాండ్‌లో ప్రయాణికుల సందడి నెలకొంది. అన్ని రూట్లలో ప్రజారవాణా జోరుగా కొనసాగుతున్నది. కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం 96 ఆర్టీసీ బస్సులు, 33 అద్దె బస్సులను నడిపించారు. డిపో నుంచి హైదరాబాద్, నిజామాబాద్, రామాయంపేట్, కరీంనగర్, నిజాంసాగర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలకు బస్సులు నడిపించారు.
అధికారుల సమన్వయంతో...
ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన రోజు నుంచి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ, డీవీఎం గణపతిరాజు, డీఎం ఆంజనేయులు, ఆర్టీఏ అధికారిణి వాణి, ఎంవీఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో బస్సులను అన్ని రూట్లో మానిటరింగ్ చేస్తున్నారు. తాత్కాలిక కండక్టర్లు నిర్దేశించిన బస్సు టికెట్లు చార్జీలు వసూలు చేసేలా చూస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగుతున్నది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్మీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతున్నది. సమ్మెకు ప్రజాసంఘాలు, వివిధ ఉద్యోగ వ్యాపార వాణిజ్య, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.
బాన్సువాడలో యథావిధిగా నడిచిన బస్సులు..
బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్, రెవెన్యూ, లోకల్ ఆడిట్ సిబ్బంది, కోఆపరేటివ్ ఆడిట్ అధికారుల సమన్వయంతో టీమ్స్ మిషన్లు అందించి, బస్సులను అన్ని రూట్లకు పంపారు. బాన్సువాడ ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం 64 ఆర్టీసీ బస్సులు, 14 హైర్ బస్సులు, 40 మ్యాక్సీ క్యాబులు, ఒక ప్రైవేట్ సర్వీస్ వెహికిల్ నడిచాయి.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles