శెట్పల్లి సంగారెడ్డిలో...

Fri,November 15, 2019 01:12 AM

లింగంపేట: మండలంలోని శెట్పల్లిసంగారెడ్డిలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యనారాయణ గురువారం తనిఖీ చేశారు. ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సహకార సంఘం సిబ్బంది ఉన్నారు.

బ్యాటరీ ఆటోల పరిశీలన
కామారెడ్డి, నమస్తే తెలంగాణ : కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో వివిధ కంపెనీల బ్యాటరీ ఆటోల డెమోను కంపెనీ ప్రతినిధులు గురువారం ప్రదర్శించారు. కలెక్టర్ సత్యనారాయణ బ్యాటరీ ఆటోలను పరిశీలించారు. ఐదువందల లోపు జనాభా కలిగిన, అంతకుమించి ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు నిధుల లభ్యత బట్టి వివిధ రకాల బ్యాటరీ ఆటోలను పరిశీలించామని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట జేసీ యాదిరెడ్డి, జిల్లా ప్రత్యేకాధికారి వెంకటేశ్ దోత్రే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీపీవో నరేశ్, జిల్లా పరిశ్రమల అధికారి రఘునాథ్, అధికారులు, ఆటో కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles