19, 20న కౌన్సెలర్లకు సెమినార్

Fri,November 15, 2019 01:11 AM

రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
నాగిరెడ్డిపేట్ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధాన్యం తూకం పూర్తి కాగానే రైతులు బ్యాంకు ఖాతా, పట్టాపాస్‌బుక్, ఆధార్‌కార్డు ఇస్తే అధికారులు వెంటనే ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని తెలిపారు. ఆన్‌లైన్ ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 223 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 176 కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 24,356 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు (రూ.45 కోట్ల ధాన్యం) చేశామని, 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆన్‌లైన్ చేశారని చెప్పారు.

కోటి రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు. కౌలుదారులకు సంబంధించి 50 క్వింటాళ్ల ధాన్యం వరకు ఏఈవోలు ధ్రువపత్రాలు ఇస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని మాల్తుమ్మెద రైతులు కలెక్టర్‌ను కోరగా... పరిశీలిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, మాల్తుమ్మెద సింగిల్ విండో చైర్మన్ రాజారెడ్డి, తహసీల్దార్ పద్మావతి, ఏఈవో బబిత, సీఈవో కిష్టయ్య, రైతులు పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles