తిర్మలాపూర్ బీపీఎంపై స్పీకర్ ఆగ్రహం

Fri,November 15, 2019 01:11 AM

బాన్సువాడ రూరల్ : వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు సకాలంలో అందజేయనందుకు తిర్మలాపూర్ బీపీఎం రఘువీర్‌పై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ డబ్బులు సకాలంలో అందడం లేదని మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన వృద్ధులు, వితంతువులు బాన్సువాడకు వెళ్లి స్పీకర్‌కు విన్నవించారు. తిర్మలాపూర్ గ్రామాన్ని స్పీకర్ గురువారం సందర్శించారు. ప్రతి నెలా పెన్షన్లు సక్రమంగా ఇవ్వడం లేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు బీపీఎం పనితీరును వివరించారు. దీంతో బీపీఎంపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో డబ్బులు అందిస్తుంటే, పంపిణీ చేయక ఏం చేస్తున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీపీఎంపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోస్టల్ అధికారి రాజనర్సాగౌడ్‌కు సూచించారు. పలువురికి పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జిన్న రఘు, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ దామోదర్, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, ఎర్వాల కృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాస్, మల్లారెడ్డి, సాయిరెడ్డి, కొత్తకొండ భాస్కర్, సాయిలు, బాలయ్య, భాస్కర్‌రెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles