సాఫీగా ప్రయాణం

Wed,November 13, 2019 02:33 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ / విద్యానగర్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం 39వ రోజైన మంగళవారం కనిపించలేదు. జోరుగా ప్రజారవాణా కొనసాగింది. ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకు న్నారు. ఉదయం నుంచే బస్టాండ్‌లో బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి డిపో నుంచి వెళ్లే కరీంనగర్‌, నిజామాబాద్‌, జేబీఎస్‌, నిజాంసాగర్‌, బాన్సువాడ రూట్లతో పాటు అన్ని గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు విస్తృతంగా నడుపుతున్నారు. కార్మికుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు.

భారీ బందోబస్తు....
ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ జగదీశ్‌ బస్టాండ్‌లోనే మకాం వేసి పరిస్థితులను సమీక్షించారు. బస్టాండ్‌, డిపో వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున గుంపులుగా ఉండకుండా చర్యలు చేపట్టారు. స్టాండ్‌ ఆవరణలో చిన్నపాటి సంఘటన జరగకుండా 24 గంటల పాటు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

బస్టాండ్లలో సందడి..
39వ రోజు బస్టాండ్‌లో బస్సుల సందడి నెలకొంది. ప్రయాణికులు భారీ ఎత్తున తరలివచ్చారు. అన్ని రూట్లలో బస్సులను సిద్ధంగా ఉంచి ప్రయాణికుల కోసం వేచి చూస్తున్నారు. బస్టాండ్‌లోకి వచ్చిన ప్రయాణికులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కడికి వెళ్లాలని అడుగుతూ బస్సులను చూపించి ఎక్కిస్తున్నారు. ప్రజలకు ఇ బ్బందులు కలుగలకుండా ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ బస్సుల సంఖ్యను పెంచుతూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నారు.

కార్మికుల నిరసన...
కార్మికులు సమ్మెలో భాగంగా 39వ రోజు మంగళవారం టెంట్‌ వద్ద వంటావార్పు కార్యక్రమం చేసి నిరసన తెలిపారు. అలాగే దీక్షలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించా లని కోరారు.

బాన్సువాడలో జోరుగా ప్రయాణం..
బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలో మంగళవారం ఆర్టీసీ బస్సులను అధికారులు జోరుగా నడిపారు. ఉదయం నుంచి అన్ని రూట్లకు బస్సులను పంపించారు. 39 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఎక్కడా ప్రయాణికుల మీద పడకుండా బస్సులను మారుమూల గ్రామాలకు నడిపించారు. తాత్కాలిక డ్రైవర్లు, కం డక్టర్లు ఉదయం డిపోలకు చేరుకొని యథావిధిగా బస్సులను అన్ని రూట్లకు పంపించా రు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బాన్సువాడ డీఎస్పీ దామోదర్‌ రెడ్డి, సీఐ మహేశ్‌ గౌడ్‌ చర్యలు చేపట్టారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles