జోరందుకున్న కొనుగోళ్లు..

Wed,November 13, 2019 02:32 AM

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వర్షాలు ఆగిన వెంటనే జిల్లా యంత్రాంగం చేపట్టిన తక్షణ చర్యలతో రైతుల ముంగిట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వరుస వర్షాలు, నేల కొరిగిన పంటలతో ఆందోళన చెందిన రైతాంగానికి నష్టం రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో 223 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకోగా ఇప్పటి వరకు 166 కేంద్రాలను ప్రారంభించారు. ప్రతీ కేంద్రం లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేయడంతో ప్రారంభించిన వెంటనే కొనుగోళ్లు వేగవంతమయ్యాయి.

రూ.27 కోట్ల విలువైన ధాన్యం సేకరణ...
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారులు కేవలం వారం రోజులలోనే సుమారు రూ.27.36 కోట్ల విలువైన ధాన్యా న్ని కొనుగోలు చేశారు. లక్షా 49 వేల 132 క్వింటా ళ్ల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. కొ నుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంటనే స్థానికంగా అందుబాటులో ఉన్న రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా సాగు చేసిన ‘ఏ’ గ్రేడును రైతుల నుంచి క్వింటాలుకు రూ.1835 సేకరిస్తున్నారు అధికారులు. వర్షాలు ఎక్కువగా పడిన కారణంగా పంటలకు ఎలాంటి తెగుళ్లు రాక పోవడంతో మంచి పంట వస్తున్నదని, ఎకరానికి 30 క్వింటాళ్ల కంటే ఎక్కువగానే ఉన్నదని రైతులు ఆనందంగా చెబుతున్నారు.

నేరుగా రైతుల ఖాతాలలోకి ధాన్యం డబ్బులు...
రైతులు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సం బంధించిన డబ్బులను అధికారులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ధాన్యాన్ని తీసుకున్న అధికారులు ఆ రైతు వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు పంపిస్తారు. అక్కడికి పూర్తి వివరాలు వెళ్లిన తరువాత రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని వ్యవసాయ శాఖ అధికారుల చెబుతున్నారు. గతంలో రైతులు దళారులకు, వ్యా పారులకు ధాన్యాన్ని విక్రయిస్తే కనీసం నెల నుంచి రెండు నెలల తరువాత డబ్బులు వచ్చేవని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక చాలా మార్పు వచ్చిందని, రైతులకు మేలు జరుగుతున్నదని వారు పేర్కొంటున్నారు.

కనుమరుగైన వ్యాపారుల మోసాలు...
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు సరైన ధర చెల్లించకుండా తూకంలో మోసాలు చేసే వ్యా పారులు కనుమరుగయ్యారు. తెలంగాణ ప్రభు త్వం ముందుచూపుతో అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వ్యాపారులు రైతుల వద్దకు రావడం లేదు. గతంలో కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండడంతో చాలా మంది రైతులు దళారులను, ఇతర వ్యాపారులను ఆశ్రయించేవారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా దళారుల చిరునామా గల్లంతవడంతో పాటు వ్యాపారులు సైతం మోసాలు చేయకుండా రెవెన్యూ శాఖ చర్యలు ప్రా రంభించింది. దీంతో రైతులకు మద్దతు ధర దక్కడంతో పాటు తూకంలో మోసాలు జరుగడం లే దు. గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని కేంద్రాల్లో జోరుగా కొనుగోళ్లు
జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రామాల్లో ధాన్యాన్ని సేకరిస్తున్నాం. సేకరించిన ధాన్యాన్ని వెంటనే అందుబాటులో ఉన్న రైస్‌ మిల్లులకు చేర వేస్తున్నాం. సేకరించిన ధాన్యం వివరాలను వీలైనంత త్వరగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు పంపిస్తున్నాం. రైతులకు వచ్చే డబ్బులు అక్కడి నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం చేస్తారు.
- మమత, డీసీవో, కామారెడ్డి

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles