జోరుగా ప్రజారవాణా

Tue,November 12, 2019 03:13 AM

-ఇబ్బందుల్లేకుండా ప్రయాణం
-అన్ని రూట్లలో కొనసాగుతున్న బస్సులు
-నిరంతరం అధికారుల పర్యవేక్షణ

కామారెడ్డి, నమస్తే తెలంగాణ/విద్యానగర్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం సోమవారం కనిపించలేదు. జోరుగా ప్రజారవాణా కొనసాగింది. బస్టాండ్లు, డిపోల వద్ద వద్ద 144 సెక్షన్ విధించారు. ఉదయం నుంచే బస్టాండ్‌లో బస్సుల రాకపోకలు సాగాయి. కామారెడ్డి డిపో నుంచి కరీంనగర్, నిజామాబాద్, జేబీఎస్, నిజాంసాగర్, బాన్సువాడ, రూట్లతో పాటు అన్ని గ్రామాలకు పల్లె వెలు గు బస్సులు పయనం అయ్యాయి. బస్టాండ్‌లోని ప్లాట్ ఫాంల వద్ద అన్ని రూట్లకు వెళ్లే బస్సులను సిద్ధంగా ఉంచారు. కార్మికుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బస్టాండ్‌లో సందడి..
బస్టాండ్‌లో ప్రయాణికుల సందడి కనిపించింది. ప్రజలకు ఇబ్బందు కలుగకుండా ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్య పెంచుతున్నారు.

కార్మికుల నిరసన
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. బస్టాండ్ ఎదురుగా వేసిన టెంట్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అక్కడి నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఇంటి వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తిరిగి బస్టాండ్ ఔట్ వద్దకు చేరుకుని మానవహా రం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

బాన్సువాడలో సాఫీగా..
బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువా డ డివిజన్ కేంద్రంలో సోమవారం ఆర్టీసీ బస్సులను యథావిధిగా నడిపారు. నోడల్ అధికారి, బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ , డీఎం సాయన్న ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటల నుంచే ఆర్టీసీ బస్సులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి అన్ని రూట్లకు పంపారు. కొంత కాలంగా విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు టిమ్స్ మిషన్లు ఇవ్వడంతో ఆర్టీసీకి ఆదా యం పెరుగుతుందని డీఎం సాయన్న తెలిపారు. ప్రతి నిత్యం రూట్లలో బస్సులను నడపడంతో రెట్టింపు ఆదాయం సమకూరుతుందని సూచించారు. బాన్సువాడ సోమవారం 63 ఆర్టీసీ, 17 హైర్ బస్సులను అన్ని రూట్లలో నడిపినట్లు వివరించారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు సోమవారం స్పీకర్ పోచారం ఇంటి వద్దకు చేరుకుని సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు బసంత్, గిరిధర్, ప్రశాంత్ రెడ్డి, కార్మికులు, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles