ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

Tue,November 12, 2019 03:11 AM

విద్యానగర్ : జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభు త్వం నూతనంగా ఏర్పాటు చేసిన మైనార్టీ విద్యా సంస్థల్లో, బాలుర ఉన్నత పాఠశాలలో, ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాలలో, డెయిరీ టెక్నాలజీ కళాశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయం తి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. మైనార్టీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా పట్టుదలతో చదువుకోవాలన్నారు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని, విద్యార్థుల ఎదుగుదలకు, ఆలోచనకు తగిన పౌష్టికాహారం, సహృదయ వాతావరణం ఎంతగానో తోడ్పడుతాయని అన్నారు.

కళాశాలలో చదువుతూ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డీఈవో రాజు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఎండబ్ల్యూవో షబానా, అసిస్టెంట్ సెక్రటరీ మసూద్, కళాశాల ప్రిన్సిపాల్ ఇంతియాజ్ అలీ, నారాగౌడ్, మేసా ఉద్యోగులు గఫూర్ శిక్షక్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles