మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

Tue,November 12, 2019 03:10 AM

గాంధారి : గురుకుల కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని గాంధారి జడ్పీటీసీ శంకరనాయక్ అన్నారు. గాంధారి గురుకుల కళాశాలలో నాలుగు నెలల నుంచి విద్యార్థులకు గుడ్లను పెట్టడం లేదనే విషయం తెలుసుకున్న జడ్పీటీసీ శంకర్‌నాయక్, మాజీ జడ్పీటీసీ తాపాజీరావు, స్థానిక సర్పంచ్ సంజీవ్‌తో కలిసి సోమవారం కళాశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి కళాశాలలోని సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని అడిగినందుకు ప్రిన్సిపాల్ గంగారాం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, కేసులు పెట్టిస్తానని బెదిరిస్తున్నాడని విద్యార్థులు జడ్పీటీసీకీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కోట్ల రూపాయలను ఖర్చుచేస్తే మీరు ఎందుకు అమలుచేయడం లేదని ప్రిన్సిపాల్ గంగారాంను నిలదీశారు. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన చూసుకోవాల్సింది పోయి బాధించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles